నేల టికెట్, రెడ్ లాంటి సినిమాల్లో మెరిసిన మాళవిక శర్మ సైలెంట్ గా నేతను ఎల్ఎల్బి పూర్తి చేసిందట.అంతే కాకుండా ప్రస్తుతం హైదరాబాద్ లోని హైకోర్టులో జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా జనవరిలోనే ఆమెకు మహారాష్ట్ర లోని బార్ కౌన్సిల్ నుండి లా ప్రాక్టీస్ కోసం లైసెన్స్ కూడా వచ్చిందట. ఇక ఆ లైసెన్స్ పొందిన గత కొద్ది నెలలకే హైదరాబాద్ లో ఈ బ్యూటీ ప్రాక్టీస్ మొదలు పెట్టింది..ఇక మరో పక్క సినిమాల్లో నటిగా అవకాశాలు రాకపోవడంతో లా ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక పూర్తిగా సినిమాల్లో అవకాశాలు రాకపోతే లాయర్ గా సెటిల్ అవుతుందో లేదో చూడాల్సిందే..