పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ శుక్రవారం దాదాపు 2000కు పైగా థియేటర్స్ లో విడుదలైంది. నైజాంలో ఉదయం షోలతోనే ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. కేవలం అభిమానులే కాకుండా సినిమా ప్రముఖులు నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.