అమెరికా దేశంలో వకీల్ సాబ్ చిత్రం ప్రీమియర్ షోల ద్వారా 301,456 డాలర్లు వసూలు చేసింది. ఆ తర్వాత షోల ద్వారా 131,126 డాలర్లు వసూలు చేసింది. ట్రేడ్ వర్గాల ప్రకారం మొదటి రోజు వకీల్ సాబ్ 432,582 డాలర్లు వసూలు చేసింది. అంటే మన భారత కరెన్సీలో అక్షరాల రూ. 3.23 కోట్లు. అయితే రెండవ రోజు ఈ సినిమా సులభంగా అర మిలియన్ డాలర్లు సంపాదిస్తుంది అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కొద్దిరోజుల వ్యవధిలోనే వకీల్ సాబ్ 1 మిలియన్ల కలెక్షన్లు దాటుతుందని కూడా చెప్పుకోవచ్చు.