వకీల్ సాబ్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. పవర్ స్టార్ ప్రభంజనానికి ఎదురేలేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే వచ్చే వారం రావాల్సిన శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ వాయిదా పడింది. ఇప్పటికే విడులైన వైల్డ్ డాగ్, రంగ్ దే వంటి సినిమాల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని టాక్. వకీల్ సాబ్ రాకతో ఆ సినిమాలవైపు జనాలు కన్నెత్తి చూడట్లేదని అంటున్నారు.