ప్రేక్షకులతో కలిసి వకీల్ సాబ్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ.. ''ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్తున్నామని పవన్‌కల్యాణ్ గారికి చెప్పాం.దాంతో మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేయమని ఆయన తెలిపారు.బయట పరిస్థితులు అస్సలు బాలేదు.. కాబట్టి దయచేసి సినిమాకి వచ్చేటప్పుడు అందరూ మాస్క్‌లతో రండి. అని పవన్ మీకు ప్రత్యేకంగా చెప్పమని చెప్పారు'' అని దిల్‌రాజు వివరించారు.