టక్ జగదీష్ విడుదల తేదీ( ఏప్రిల్ 23) సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గానీ నాని గానీ సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొనడం లేదు. దీన్ని బట్టి సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కరోనా కాలంలో సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్లపై ప్రభావం పడుతుందేమోనని టక్ జగదీష్ మూవీ యూనిట్ భావిస్తోందని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.