పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమకు కొంత విరామం తర్వాత మళ్ళి సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో డైరెక్టర్లు కూడా ఆయనతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఆయన మొదటిగా చేసిన సినిమానే ‘వకీల్ సాబ్’. బిగ్ బీ అమితాబ్, తాప్సీ తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్టవడమే కాకుండా.. క్లాసిక్ గా నిలిచింది.