ఉగాది పండుగను స్వగ్రామంలో జరుపుకోవడానికి వెళ్తున్న ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ముందు ఉన్న లారీని ఓవర్టేక్ చేయబోయి డివైడర్ను దాటి.. అవతలి రోడ్డులో వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జోగుళాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం పరిధిలో చోటు చేసుకుంది.