26/11 ముంబై టాకీస్ లో ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ చేసిన త్యాగం అంత త్వరగా మర్చిపోయేది కాదు. ఆ సంఘటన తో పాటు మేజర్ జీవితం గురించి మనకు తెలియని విషయాలను కూడా ఈ చిత్రం ద్వారా తెలియజేయబోతున్నారు. ఈ చిత్రంలో అడవి శేషు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేజర్ చిత్రం టీజర్ ఏప్రిల్ 12న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల కాబోతోంది. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ టీజర్ ను "సల్మాన్ ఖాన్", తెలుగు టీజర్ ను "మహేష్ బాబు", మలయాళం టీజర్ ను "పృథ్వీరాజ్ సుకుమారన్" వంటి స్టార్ హీరోలతో విడుదల చేయబోతున్నారు.