తెలుగు చిత్ర పరిశ్రమకి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానులు ఆరాధిస్తుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు బ్రాండ్ అని చెబుతారు. అయితే పవన్ చాలా ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అంటూ ఒక నిర్మాణ సంస్థ నిర్మించాడు.