చిత్ర పరిశ్రమలో కొన్ని క్రెజీ కాంబినేషన్స్ ఉంటాయి. ఇక ఆ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఓకే అయితే చాలు.. సగం హిట్ కొట్టినట్లే అని అంటుంటారు. దాని కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తారు. నిర్మాతలు రకరకాల ప్రయత్నాలు చేసి ఓకే చేస్తారు. ఇక ఇదంతా స్టార్ హీరోలు స్టార్ దర్శకుల విషయంలో అయితే ఇంకొంచెం ఎక్కువ కష్టం. అంత కష్టపడి కుదిర్చిన కాంబినేషన్ రద్దు కావడంతో అందరూ బాధపడుతుంటారు.