మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ "అయ్యప్పనుమ్ కొషియమ్" తెలుగులో రీమేక్ చేస్తుండగా.. రెగ్యులర్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమాని డైరెక్టర్ సాగర్ కే చంద్ర రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో రూపొందిస్తున్నారని సమాచారం. రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో రూపొందిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగులు అందిస్తున్నారు.అయితే రాయలసీమ యాసలో డైలాగులు అందిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సింగర్ - లిరిసిస్ట్ అయిన పెంచల్ దాస్ సహాయం చేస్తున్నారని సమాచారం అందుతోంది.