గతేడాది సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కరోనా లాక్డౌన్ తర్వాత మరో సినిమాకు ఓకే చెప్పారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టరును కూడా విడుదల చేశారు. పోస్టరుతోనే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.