వకీల్ సాబ్ చిత్రం ఏపీలో ఎంత వసూళ్లు రాబట్టింది అనే విషయంలో స్పష్టత లేదు. క్లారిటీ ఉన్నా కూడా ప్రభుత్వం ఈ సినిమా కు వ్యతిరేకంగా నిలబడ్డ నేపథ్యంలో, కలెక్షన్ లెక్కలు చెప్పి, ఎక్కడ బుక్ అవుతామన్న భయంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఉన్నారు. దీనిపై ఎప్పటికి స్పష్టత వస్తుందో.. ఏమో చెప్పలేమని అంటున్నారు ట్రేడ్ పండిట్లు..