టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా ఎంతో స్టైల్‌గా కనిపించాలని అనుకుంటాడు. బ్రాండెండ్ బట్టలు, షూస్, వాచ్‌లు ధరిస్తూ స్టైల్ ఐకాన్‌గా కనిపిస్తుంటాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రామ్‌చరణ్ ధరించే వాచ్‌ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పడుతున్నాయి.