తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలిచాడు. ఇక మెగా కుటుంబం నుంచి ఇప్పటికే క్రికెట్ టీంకు సరిపోయేంత మంది హీరోలు వచ్చారు. వచ్చిన వాళ్లలో దాదాపు అంతా సక్సెస్ అయ్యారు. ఒకరిద్దరు మాత్రమే ఇప్పటికీ తమ గుర్తింపు కోసం పాకులాడుతున్నారు.