కోలీవుడ్‌కి చెందిన వర్ధమాన నటి రాధ పోలీసులను ఆశ్రయించారు. ఓ పోలీసు అధికారి తనను నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు చేశారు. సదరు పోలీసు అధికారిపై చీటింగ్ కేసు పెట్టింది. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. సుందరం ట్రావెల్స్ చిత్రంలో కథానాయకీగా తమిళ సినీ రంగానికి రాధ(38) పరిచయం అయ్యారు.