స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక గతేడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.