మురుగదాస్ డైరెక్షన్లో మరొక సినిమా తీయడానికి చిరంజీవి సైన్ చేశాడని తెలుస్తోంది.. ఎందుకంటే ఆల్రెడీ గత 14 సంవత్సరాల కిందటే, స్టాలిన్ సినిమా తో వీరిద్దరి కాంబినేషన్ మొదలయింది. ఇప్పుడు మరో సారి వీరిద్దరి కాంబినేషన్ తెరపైకి వస్తున్నట్లు సమాచారం. అయితే స్టాలిన్ మాత్రం అబౌవ్ ఆవరేజ్ గా ఆడింది. కానీ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన ఠాగూర్, ఖైదీనెంబర్150 కథలు మాత్రం మురుగదాస్ తోనే వచ్చాయి. ఈమధ్య మురుగదాస్, చిరు కు వీడియో కాల్ చేసి, ఒక కథ వినిపించాడట. ఇక ఈ కథ చిరంజీవికి నచ్చడంతో ఆయన ఓకే చెప్పేశాడు.