హీరో రామ్ నటించిన "జగడం, రెడీ, శివమ్, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే". వంటి చిత్రాలకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. అయితే ఈ చిత్రాలలో కొన్ని హిట్లు ఉన్నాయి. మరి కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మ్యూజికల్ పరంగా ఈ సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు మరో సారి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తో రామ్ ఆ సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ వ్యవహరించబోతున్నాడు.