తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్స్ కి మంచి గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు ఈ మధ్యకాలంలో వచ్చిన కమెడియన్స్ తో వచ్చింది కాదు.. అప్పట్లో ప్రముఖ కమెడియన్ రేలంగికి హీరోల కంటే ఎక్కవ డిమాండ్ ఉండేదని అందరు చెబుతుంటారు. కమెడియన్స్ వారి నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.