నటి సమీరా రెడ్డి తల్లి అయిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా బరువు పెరిగింది. ఇక ఈమె బరువు తగ్గించుకోవడం కోసం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ను మొదలు పెట్టింది..ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది డైట్ కాదు.. ఏం తినాలి అన్న విషయం కంటే ఎప్పుడు తినాలి అన్న విషయం గురించి ఇది చెబుతుంది. చాలామంది బరువు తగ్గడం లో భాగంగా దీన్ని అనుసరిస్తుంటారు.. అయితే నిజం చెప్పాలంటే ఫాస్టింగ్ అనేది మన సాంప్రదాయం లో ఒక భాగం. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అదెలా అంటే, ఉపవాసం ఉన్న సమయంలో జీర్ణవ్యవస్థకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. ఈ సమయంలో శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఇక ఈ ప్రక్రియే మనల్ని పునరుత్తేజం చేస్తోంది. అది క్రమంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది..