ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు రాని ఓ సరికొత్త సినిమా ఇది. ఒకే క్యారెక్టర్ తో, సింగిల్ షాట్ తో తీయబోయే సినిమాలో హన్సిక నటించబోతోంది.ఆ సినిమా పేరు '105 మినిట్స్ ' రాజు దుస్సా అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం ను రుద్రాన్ష్ సెల్యులాయిడ్ బ్యానర్ మీద బొమ్మక్ శివ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హన్సిక తప్ప మరెవరూ కనిపించరట. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎడిటింగ్ లేకుండా కంటిన్యుటీ తో ఓకే షాట్ లో కథ మొత్తం చెప్పేస్తారట.