ఓ వైపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత తమ అభిమాన నటుడు పవర్ స్టార్ సినిమా థియేటర్లలోకి వచ్చిందని మెగా ఫ్యాన్స్ సంబరపడుతుంటే..మరోవైపు సినీ పరిశ్రమ ప్రతినిధులు టికెట్స్ విషయంలో ఏపీ సర్కారు ఇచ్చిన షాక్ తో సతమతమవుతున్నారు. పవన్ చిత్రం వకీల్ సాబ్ ను టార్గెట్ చేసినట్లుగా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన టిక్కెట్టు ధరల జీవో సినీ రంగానికి పెద్ద సమస్యగా మారింది.