హీరోయిన్ నిక్కీ గల్రానీ టాలీవుడ్ లో మంచి నటిగా పేరు గుర్తింపు సంపాదించుకుంది. ఈ అందాల భామ చేసినవి కొన్ని సినిమాలే అయినా తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. కన్నడ భామ సంజనా గల్రానీ చెల్లిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిక్కీ గల్రానీ తెలుగులో సునీల్ హీరోగా చేసిన కృష్ణాష్టమి మూవీలో హీరోయిన్ గా చేసింది. అంతేకాదు.. ఈ భామ మరకతమణి మలుపు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షక్షకులకు మరింత దగ్గరైంది.