తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయనకు ఛత్రపతి సినిమాకు ముందు వరకు కూడా ప్రభాస్ కేవలం ఓ హీరో మాత్రమే. ఆయనకు వర్షం లాంటి విజయం వచ్చినా కూడా మాస్ ఇమేజ్ మాత్రం రాలేదు. కోరుకున్న మార్కెట్ కూడా క్రియేట్ కాలేదు. అలాంటి సమయంలో రాజమౌళి వచ్చి చత్రపతి సినిమాతో ప్రభాస్ రేంజ్ మార్చేసాడు.