ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో తమ సినిమాలను విడుదల చేయడానికి వెనకడుగు వేస్తున్నారు హీరోలు.. ఇప్పటికే లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం చిత్రాలు వాయిదా పడడమే ఇందుకు నిదర్శనం అని చెప్పాలి..ఇక, ఆ తర్వాత రాబోయేవి పెద్ద చిత్రాలే. మెగాస్టార్ ఆచార్య, వెంకటేష్ నారప్ప, బాలకృష్ణ అఖండ రవితే ఖిలాడి, కేజీఎఫ్-2, ప్రభాస్ రాధేశ్యామ్, అల్లు అర్జున్ పుష్ప చిత్రాలను కూడా వాయిదా వేసే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.