అఖిల్ 4 వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల కాకుండానే సురేందర్‌రెడ్డి లాంటి పెద్ద దర్శకుడి తో 'ఏజెంట్'అనే సినిమాను మొదలు పెట్టేస్తున్నాడు. దీని తర్వాత అతను అజయ్ భూపతి సినిమాకి కూడా కమిట్ అయ్యాడట. అయితే ముందుగా అఖిల్ అన్నయ్య నాగచైతన్యతో అజయ్ భూపతి పనిచేయాల్సి ఉంది. 'మహాసముద్రం'లో హీరోగా ముందుగా నాగచైతన్యనే అనుకున్నాడతను. ఇద్దరి మధ్య కధ చర్చలు కూడా జరిగాయి. కానీ ఎందుకో ఇద్దరికి సెట్ కాలేదు. ఇప్పుడు అఖిల్ తో అదే సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.