నాచురల్ స్టార్ నాని నటించిన సినిమా 'జెర్సీ '. నిన్నటితో ఈ సినిమా విడుదలై 2 సంవత్సరాలు అవుతోంది. అయితే ఈ మధ్యనే జెర్సీ సినిమాకు 2 నేషనల్ అవార్డులు కూడా లభించాయి. జాతీయ ఉత్తమ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించారు. ఈ చిత్రంలో నాని తన నట విశ్వరూపాన్ని చూపించాడు. బోల్డ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా ని కూడా బాగా చూపించాడు దర్శకుడు