తెలుగు చిత్ర పరిశ్రమలో అంజలా జవేరీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె ప్రేమించుకుందాంరా' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ తో జోడి కట్టింది. ఆ సినిమాలో కావేరిగా అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత చూడాలని ఉంది, సమర సింహారెడ్డి, రావోయి చందమామ వంటి సినిమాలలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.