బుల్లితెర యాంకర్ అనసూయ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్డస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రేక్షకులను తన మాటలతో మైమరిపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.