పెళ్లి చూపులు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు నటిగా రితూ వర్మ పరిచయం అయ్యారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా ఇద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల మన్నన పొందింది. అయితే ఈ సినిమా హిట్ అయినా.. ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. ఈ తర్వాత హీరో నిఖిల్‌తో నటించిన కేశవ సినిమా కూడా యావరేజ్‌గా నడిచింది.