అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు ఖాతా పెద్దగా హిట్ సినిమాలు లేకపోయినా.. ఇప్పటివరకు అందరూ స్టార్ హీరోల సరసనే నటించారు. ఇప్పటివరకు తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించారు. అయితే వీటిలో ఎక్కువ సినిమాలు తెలుగులో చేశారు.