తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నిఖిల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. హ్యాపీ డేస్ చిత్రంలో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.