తెలుగు సినీ ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య మరణంపై ఉదయభాను స్పందిస్తూ..వీరయ్య అంకుల్ మరణవార్త వినగానే హృదయం ముక్కలైనట్టు అనిపించిందని, ఇది భరించలేని నిజమంటూ , చెప్పడానికి ఎంతో బాధగా ఉంది అని బాధపడింది.. ఇక అంతే కాకుండా ఇప్పుడు కలుగుతున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను.. ఒక మంచి వ్యక్తిని ఈ ప్రపంచం కోల్పోయింది. దేవుడా ఇకమీదట అయినా మా మీద కొంచెం దయ చూపు అంటూ బాగా ఎమోషనల్ అయ్యింది ఉదయభాను..