ప్రతి మహిళ పిల్లలకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటం అనేది అతి ముఖ్యమైన విషయం. గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర, తక్కువ ఒత్తిడి, ఆత్మ విశ్వాసం పెరగడం,సంతోషంగా ఉండడం అనే అంశాలు ముఖ్యమైనవి.