కొద్ది రోజుల క్రితం ప్రభాస్,మహేష్,చరణ్,విజయ్ దేవరకొండ,రామ్ లు దిగిన ఫోటో అయితే నెట్టింట్లో వైరల్ అయింది. ఇది ఒక అద్భుతం అనుకుంటే. ఇప్పుడు దానిని మించిన ఒక ఫోటో కాదు ఒక ఊహాచిత్రం వైరల్ గా మారింది. అందరి స్టార్ హీరోలు కలిసి టీ తాగడానికి వెళ్లి అక్కడ సరదాగా గడుపుతున్న సమయం ఎంతో అద్భుతంగా ఉంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.ఈ ఫోటోలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా కలిసి సరదాగా టీ కాఫీలు తాగడానికి కాఫీ షాప్ కి వెళ్తే ఎలా ఉంటుందో అనే ఊహ తో, హర్ష అనే ఆర్టిస్ట్ స్కెచ్ గీసాడు. ఇదే ఫోటో ని పవన్ కళ్యాణ్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. మిగిలిన హీరోలు కూడా ఈ ఫోటోను షేర్ చేస్తూ ఉండడంతో ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.