స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు కథానాయకుడిగా ,కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం "మానాడు". ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ కామాచి రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ,మలయాళం భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక బహు భాషా చిత్రంగా మానాడు సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.ఇక ఈ చిత్రంలో ఆరు నిమిషాల నిడివి గల ఒక షాట్ ను కేవలం సింగిల్ టేక్ లో చేసి, శింబు శభాష్ అనిపించుకున్నాడు.. ఇక ఈ షాట్ లో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని తో పాటు ఎస్.జె.సూర్య కూడా పాల్గొన్నారు..