టీ నగర్ హబీబుల్లా సమీపంలోని సర్వీస్ అపార్ట్మెంట్ లో ప్రముఖ నటి విజయలక్ష్మి మూడు నెలలుగా అద్దె కట్టలేదని ఆమె సామాన్లు స్టోర్ రూమ్ లో పెట్టడం జరిగింది. ఇక ఆమె మేనేజర్ విఘ్నేశ్వరన్ ను సంప్రదించింది..ఇక ఆ మేనేజర్.. మూడు నెలల నుండి అద్దె చెల్లించలేదని, అందుకే మీ సామాన్లు స్టోర్ రూమ్ లో పెట్టించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎటూ తోచక ఆమె మీడియాను ఆశ్రయించడం, అందుకు విఘ్నేశ్వరన్ మాట్లాడుతూ .."మేమేమీ ఆమె సామాన్లు కావాలని బయట పడేయలేదని , ఒక గదిలో పెట్టి ఉంచామని.. ఆమె ఫ్లాట్స్ సిబ్బంది శివ ను చెప్పుతో కొట్టడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు" అతను చెప్పుకొచ్చాడు..