దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు గారు ఏప్రిల్ 28న సరిగ్గా అంటే 44 ఏళ్ల క్రితం, నందమూరి తారక రామారావు తో తొలిసారిగా"అడవి రాముడు"చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసింది.అడవి రాముడు సినిమా కు ఎన్టీఆర్,రాఘవేంద్ర కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా కాగా జయప్రద, జయసుధ తో ఎన్టీఆర్ కలిసి నటించడం, అందులోనూ ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఒక జానపదం మూవీను సోషలైజ్ చేసి విజయం సాధించిన ఘనత కూడా ఈ సినిమాదే. ఇక ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ హీరోగా ఇదే టైటిల్ తో అడవి రాముడు సినిమా రావడం విశేషం. అంతేకాకుండా రాఘవేంద్రరావు ప్రియశిష్యుడైన దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 పార్ట్ లను తెరకెక్కించారు. ఇందులో బాహుబలి 2 వ పార్ట్ ఏప్రిల్ 28న విడుదలైంది.అందుకే రాఘవేంద్రరావుకు ఏప్రిల్ 28 వ రోజు అంత స్పెషల్.