నాని హీరోగా తెరకెక్కిన కృష్ణార్జున యుద్ధం సినిమా లో హీరోయిన్ గా నటించింది రుక్సార్ థిల్లాన్. ఈ సినిమాలో ఈమె నటించిన నటన గాని మీకు మరో సినిమా అవకాశం వచ్చింది అదే అల్లు శిరీష్ నటించిన ఎబిసిడి చిత్రం. ఈ చిత్రం సరైన విజయాన్ని అందించకపోవడంతో ఈమె కు నిరాశే మిగిలింది.హిందీలో "బాంగ్రా పా లే " అనే డాన్స్ తరహా చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ , కరోనా కారణంగా ఈ అవకాశం పెద్దగా కలిసి రాలేదు. ఇక దీంతో ఈమె అవకాశాల్లేక ఇంటిపట్టునే ఖాళీగా సమయాన్ని గడుపుతోంది.. అయితే ఈ మధ్యనే ఈ అమ్మడికి తెలుగులో ఒక ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పటికీ , కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ఈమెకు తీవ్ర నిరాశే మిగిలింది..