హారిక హాసిని సంస్థలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయాల్సివుంది. అన్నీ కుదిరితే.. `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్లోనే ఆయన చేసేద్దురు. కానీ కుదర్లేదు. కానీ బాలయ్య ఇచ్చిన కాల్షీట్లు మాత్రం ఆ సంస్థ దగ్గర ఉన్నాయి. అందుకే బాలయ్య కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో పడింది హారిక - హాసిని. అందుకోసం బడా రైటర్లతో సంప్రదింపులు జరుపుతోందని టాక్.