రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఈ పేరు వినగానే గుర్తొచ్చేది పవర్ ఫుల్ డైరెక్టర్. ఆ తర్వాత ఇప్పుడు ఈ పేరు వినిపిస్తే అందరూ అనే మాట వివాదాల విక్రమార్కుడు. మరి నేడు కనిపిస్తున్న వర్మ సామాజిక స్పృహ తో వెలిగిపోతూ ప్రజల కోసం లీడర్ గా మారారా అంటే ? తాజాగా సోషల్ మీడియా వేదిక పై ఆయన చేస్తున్న పోస్ట్ లు నిజమే అంటున్నాయి. అంతే కాదు నిరంతరం ఆయన చేసే పోస్ట్ లపై విమర్శలు విసిరే ఎక్కువ మంది నెటిజన్లు, నేడు ఆయన వ్యవహార శైలికి జేజేలు పలుకుతూ మద్దతు తెలుపుతున్నారు.