ప్రత్యేక కథతో తెరకెక్కిన సినిమాలు విజయవంతం అయితే వాటినీ కొనసాగిస్తూ సీక్వెల్స్ తీయడం ఇప్పుడు జరుగుతున్న విషయం. అందులోనూ హార్రర్ చిత్రాలైతే కథ బాగుండి హిట్ కనుక కొడితే దానికి సీక్వెల్ చేయడం పరిపాటి. ఇదే తరహాలో కాంచన మూవీ అటు తమిళ భాషలోనూ, ఇటు తెలుగు లోనూ వరుస సీక్వెల్స్ తో విజయాలను అందుకుంటోంది. ఇక దర్శకుడు సుందర్ .సి కూడా అదే బాటలో పయనస్తున్న విషయం తెలిసిందే.