దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గతేడాది కంటే.. ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత ఎక్కవగానే ఉంది. ఇక సినిమా భాషలో చెప్పాలంటే.. కరోనా విలన్లా మారి సినిమా పరిశ్రమపై దాడి చేస్తోంది. ఈ మహామ్మారి కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.