ప్రస్తుతం కమల్ హాసన్ కూడా" మక్కల్ నీది మయ్యమ్ " అనే పార్టీని స్థాపించారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూర్ నియోజవర్గం సోత్ నుండి పోటీ చేయగా, బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో ఉన్న కమల్, సాయంత్రానికి శ్రీనివాసన్ ముందంజలో ఉన్నారు. కమలహాసన్ మొదటి నుండి గట్టిగానే ప్రయత్నించి, చివరికి వచ్చేసరికి ఘోర అవమానం పాలయ్యాడు. కౌంటింగ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి శ్రీనివాసన్, కమల్ హాసన్‌పై 1500 ఓట్లతో గెలుపొందారు.ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తున్న హీరోల లాగే కమలహాసన్ కూడా తన స్థానాన్ని రాజకీయాల్లో పదిలం చేసుకోలేకపోయాడు. ఎన్నడూ లేని విధంగా కమలహాసన్ ఘోర అవమానం పాలయ్యాడు..