దర్శక ధీరుడు దాసరి నారాయణ ప్రేక్షకులలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు. ఈయన మరణించి నాలుగేళ్లు అయినా, తెలుగు తెరపై దాసరి నారాయణ ఓ చెరిగిపోని సంతకం. దర్శకుడు అంటే సినిమాకు క్యాప్టెన్ అనేది పాతకాలం మాట. కానీ దాన్ని మళ్ళీ తీసుకువచ్చి డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ అని చాటిన ఘనుడు దాసరి నారాయణ. ఈయన 151 చిత్రాల రూపకల్పనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నాడు. చిత్రసీమలో కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే , నిర్మాణం, దర్శకత్వం, నటన ఇలా పలు శాఖల్లో తనదైన బాణీ పలికించిన మేటి దాసరి