గతేడాది లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మళ్ళీ పుంజుకోవడానికి 9 నెలల టైం పట్టింది. 2020 మార్చిలో ఆగిన కలెక్షన్ల సౌండ్ 2021 జనవరిలో వినిపించడం మొదలైంది. ఈ ఏడాది సెకండ్ వేవ్ తో ఇండస్ట్రీ పనులు ఆగిపోయిన తర్వాత మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో తెలియడంలేదు. అటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా కరోనా బారిన పడటం, తొలి దశలో కంటే రెండో దశలో మరణాల సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగించే విషయమే. పెద్ద హీరోలు టీకా తీసుకున్నా కూడా.. కోరి కష్టాలు తెచ్చుకునేందుకు సిద్ధంగా లేరు. అందుకే సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి, విడుదల తేదీలు పోస్ట్ పోన్ అయ్యాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుని, పరిస్థితులు చక్కబడితే.. ఈ ఏడాది చివరినాటికి టాలీవుడ్ లో సందడి మొదలయ్యే అవకాశం ఉంది.