తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం దర్శకరత్న దాసరి నారాయణరావు. దాసరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అనే గ్రామంలో మే 4,1942 లో జన్మించారు. ఈయన తెలుగు సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. తాను చనిపోయే ముందు వరకు కూడా సినీ ఇండస్ట్రీ బాగు కోసం కృషి చేసిన మహానుభావుడు. ఈయనకు సినిమా రంగంలో చేసిన నిరంతర సేవలకు గానూ ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి.