ఇక కొన్ని పాపులర్ సీరియల్స్ నుంచి కొంత మంది హీరో హీరోయిన్స్ అలాగే నటులు తప్పుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో హీరోగా నటిస్తున్న చందన కుమార్ అనుకోని కారణాల చేత తప్పుకోవాల్సి వచ్చింది.. ఇక స్టార్ మా లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో శివ పార్వతి కూడా కొన్ని కారణాల చేత తప్పుకున్నారు..ఈటీవీలో ప్రసారమవుతున్న యమలీల సీరియల్ లో వజ్రా కూతురు గా నటిస్తున్న వైజూష కి ముందు మహేశ్వరి నటించి, ఆమె కూడా తప్పుకుంది. ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారం అవుతున్న కల్యాణ వైభోగమే సీరియల్ లో హీరోగా నటించిన సన్నీ కూడా సడన్ గా తప్పుకున్నాడు. అలాగే అత్తారింట్లో అక్క చెల్లెలు సీరియల్ లో కూడా చైత్ర రాయ్ హీరోయిన్ గా నటిస్తూ తప్పుకుంది. ఇక ఇంటిగుట్టు సీరియల్ లో నటిస్తున్న రోహిత్ రంగస్వామి సీరియల్ నుంచి తప్పుకున్నాడు.